News April 4, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు..

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాలూరులో 37.1°C, మక్కువ 39.1, పాచిపెంట 36.8, కురుపాం 40.8, గరుగుబిల్లి 41.3, గుమ్మలక్ష్మీపురం 41.2, కొమరాడ 40.7, జియ్యమ్మవలస 41.2, పార్వతీపురం 40.3, సీతానగరం 40.6, బలిజిపేట 40.3, పాలకొండ 39.4, వీరఘట్టం 40.3, సీతంపేట 39, భామిలో 39.7గా నమోదౌతాయని తెలిపింది.
Similar News
News April 5, 2025
LSG విజయం.. గోయెంకా సంతోషం..!

ఐపీఎల్‌లో ముంబైతో విజయం అనంతరం LSG ఓనర్ సంజీవ్ గోయెంకా చిరునవ్వులు చిందించారు. కెప్టెన్ రిషభ్ పంత్, సిబ్బందితో కలిసి ఆయన స్టేడియంలో సంతోషంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఎన్నాళ్లకెన్నాళ్లకు గోయెంకా నవ్వారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఎల్ఎస్‌జీని రెండు వరుస ఓటములు పలకరించడంతో రిషభ్ పంత్‌పై గోయెంకా సీరియస్ అయిన విషయం తెలిసిందే.
News April 5, 2025
MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News April 5, 2025
SRD: అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్ క్రాంతి

సన్న బియ్యం పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.