News March 27, 2025
పార్వతీపురం: రిపోర్టర్‌లు కావలెను

పార్వతీపురం మన్యం జిల్లాలో Way2Newsలో పనిచేసేందుకు రిపోర్టర్‌లు కావలెను. మీడియా రంగంలో అనుభవం ఉన్న వారు మాత్రమే అర్హులు. మీ వివరాలను <
Similar News
News April 1, 2025
రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయి: KCR

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వింతైన పాలన సాగిస్తోందని మాజీ CM KCR దుయ్యబట్టారు. మార్పు కోరుకుంటూ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలోనూ తాను ఊహించలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చేలా వరంగల్ బహిరంగ సభ(APR 27) ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
News April 1, 2025
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకట్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలోని ఎన్.వి.కె ఫంక్షన్ హాల్ హాల్‌లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఐ.కె.పి సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.
News April 1, 2025
భద్రాచలం: ట్రైబల్ మ్యూజియం పట్ల కలెక్టర్ సంతృప్తి

ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా నేటి తరానికి అందించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియాన్ని పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్‌తో కలిసి సందర్శించారు. మ్యూజియంలో గిరిజన సంస్కృతిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కళాఖండాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.