News March 11, 2025

పార్వతీపురం: వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల పేదలకు స్వయం ఉపాధి పథకాలు

image

జిల్లాలోని దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకం కింద యూనిట్ల స్థాపన, జెనరిక్ ఫార్మసీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సం.రంలో 21 నుంచి 60 ఏళ్ల వయసు ఉండి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.

Similar News

News March 12, 2025

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని కొత్తపేట పోలీసులు తెలిపారు. జీజీహెచ్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద వ్యక్తి చనిపోయాడని సెక్యూరిటీ గార్డు కొత్తపేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 12, 2025

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

image

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ఎమ్.సంపూర్ణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంపూర్ణ రావు సతీమణి మార్తమ్మకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్‌లను జిల్లా ఎస్పీ అందజేశారు.

News March 12, 2025

వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లలిత

image

విజయనగరం ఉడా కాలనీకి చెందిన క్రీడాకారిణి కిల్లకి లలిత వరల్డ్ పారా అథెటిక్స్‌లో మెరిసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టీ-11 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. లలిత జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, తోటి క్రీడాకారులు అభినందించారు.

error: Content is protected !!