News April 5, 2025

పార్వతీపురం: సెకండ్ గ్రేడ్ టీచర్ పరీక్షకు ఉచిత శిక్షణ

image

జిల్లాలో వెనుకబడిన తరగతులు, ఆర్థిక, బలహీన వర్గాల అభ్యర్థుల నుంచి సెకండ్ గ్రేడ్ టీచర్ పరీక్షకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి అప్పన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్సీ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

Similar News

News April 6, 2025

భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

image

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

News April 6, 2025

మా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు: SRH కోచ్

image

ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ 300 కొడుతుందన్న అంచనాలు ఉంటున్నాయి. అవే ఆ జట్టు కొంపముంచాయా? SRH అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మట్ ఆ విషయంపై స్పందించారు. ‘అంచనాల ఒత్తిడి మాపై ఏమాత్రం లేదు. ఇదంతా జట్టుకు బయట జరుగుతున్న విషయం మాత్రమే. అంతర్గతంగా జట్టుపై అది ఎలాంటి ప్రభావమూ చూపించదు’ అని పేర్కొన్నారు. 300 పరుగులు అటుంచి ఈ సీజన్లో మ్యాచులు గెలిచేందుకు కూడా సన్‌రైజర్స్ ఇబ్బంది పడుతుండటం గమనార్హం.

News April 6, 2025

నారాయణపేట: ఆరుగురిపై కేసు నమోదు 

image

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల శివారులో కొంత మంది జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఉట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.7,700 నగదు, 6 సెల్‌ఫోన్లు, 3 బైక్‌లు, పేకముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఎస్ఐ కృష్ణంరాజు శనివారం తెలిపారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

error: Content is protected !!