News March 5, 2025
పార్వతీపురంలో చినజీయర్ స్వామి

పార్వతీపురం పట్టణం బెలగాంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రముఖ పీఠాధిపతి రామనుజం శ్రీచినజీయర్ స్వామి వచ్చారు. పార్వతీపురంలో రామ పాదుక ఆరాధన కార్యక్రమం బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చారు. దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
Similar News
News March 6, 2025
మెదక్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
News March 6, 2025
ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకూ అవకాశముందన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
News March 6, 2025
కృష్ణా జిల్లాలో 39.9 డిగ్రీల ఎండ

కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎండ మండిపోయింది. ముఖ్యంగా కంకిపాడులో 39.9 నమోదు కాగా.. బాపులపాడు, గన్నవరం, పెనమలూరులలో 39 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉన్నదాని కంటే నాలుగు శాతం ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.