News March 1, 2025

పార్వతీపురంలో మెుదలైన పింఛన్ల పంపిణీ

image

పార్వతీపురం మన్యం జిల్లాలో మార్చి నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియ మొదలైంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ నెల నుంచి ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీని చేపడుతున్నారు. కాగా జిల్లాలో 1.48 లక్షల మంది పెన్షన్ దారులున్నారు. వీరందరికీ రూ.59 కోట్ల మేర పంపిణీ చేయాల్సి ఉంది.

Similar News

News March 1, 2025

ఆశా వర్కర్లకు CM గుడ్ న్యూస్

image

ఏపీలోని 42వేల మంది ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశారు. రిటైర్మెంట్ వయోపరిమితి 62 ఏళ్లకు పెంచారు. అందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.10వేల జీతం వస్తోంది. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షలు పొందే అవకాశం ఉంది. వీటిపై త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నాయి.

News March 1, 2025

వికారాబాద్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు

image

వికారాబాద్ జిల్లాలో నూతనంగా 22,404 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. మార్చి నుంచే రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు తెలిపారు. గతంలో 2,41,169 రేషన్ కార్డులు ఉన్నాయి. నూతనంగా మరో 22,404 మంజూరు అయ్యాయి. దీంతో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,63,573కు చేరింది. SHARE IT

News March 1, 2025

పార్వతీపురం: ఇంటర్ పరీక్షలు.. 586 మంది గైర్హాజరు

image

కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 9,335 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి 8,749 మంది హాజరయ్యారన్నారు. 586 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరాలు వెల్లడించారు. పరిక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.

error: Content is protected !!