News February 1, 2025
పాలకుర్తి: ఆన్‌లైన్ సెంటర్ సీజ్ చేసిన అధికారులు
పాలకుర్తిలో యాకేశ్ అనే వ్యక్తి కార్తీక కామన్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేస్తున్నాడు. శుక్రవారం సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రాకేశ్ తెలిపారు. ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఐడీ లేకున్నా ఇతరుల ఐడీతో ఆధార్ వివరాల అప్‌డేట్ చేయడంతో సెంటర్‌ను సీజ్ చేసి 2 ల్యాప్‌టాప్‌లు, 2 ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News February 1, 2025
క్యాన్సర్ మందులపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత
కస్టమ్స్ డ్యూటీలో కీలక మార్పులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్యాన్సర్, ఇతర ప్రమాదకర వ్యాధుల మెడిసిన్లపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు.
News February 1, 2025
2047కల్లా 100 GW అణు విద్యుత్ లక్ష్యం: నిర్మల
2047కల్లా కనీసం 100 గిగావాట్ల అణువిద్యుత్‌ను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘చిన్న చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు రూ.20వేలకోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ రంగంతో క్రియాశీల భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.
News February 1, 2025
BUDGET: స్కూల్ స్టూడెంట్స్ కోసం ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’
ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ మిషన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 50వేల పాఠశాలల్లో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ నెలకొల్పుతామని ప్రకటించారు. ఇవి స్టూడెంట్స్‌లో ఆసక్తి, సృజన, సైంటిఫిక్ టెంపర్‌మెంట్ పెంచుతాయని తెలిపారు. డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.