News February 25, 2025
పాలకొండ: 12 ఏళ్లలో నలుగురు దొరికారు

పాలకొండ నగర పంచాయతీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పాలకొండలో ఇప్పటివరకు 16మంది కమిషనర్‌లు పని చేశారు. అందులో నలుగురు ACBకి పట్టుబడ్డారు. 2013లో పి.నాగభూషణరావు, 2015లో టి.కనకరాజు, 2021లో నడిపేన రామారావు, ఇప్పుడు సర్వేశ్వరరావు రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
Similar News
News December 14, 2025
విశాఖ సెంట్రల్ జైలు ఖైదీలకు భగవద్గీత బోధన

విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు మానసిక రుగ్మతలను జయించేందుకు, ప్రశాంతమైన జీవితాన్ని జీవించేందుకు భగవద్గీతను బోధించారు. భగవద్గీత మానవాళి జీవితానికి దిశా నిర్దేశంగా ఉంటుందని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భగవద్గీతను అనుసరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
News December 14, 2025
దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే: ఖర్గే

ఓట్ చోరీకి పాల్పడే వారు ద్రోహులని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైరయ్యారు. ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే BJPని అధికారం నుంచి దింపేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ భావజాలాన్ని బలోపేతం చేయడం భారతీయుల బాధ్యత. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. RSS ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది’ అని ఆరోపించారు. తన కొడుక్కు ఆపరేషన్ ఉన్నా వెళ్లలేదని, 140 కోట్ల మందిని కాపాడటమే ముఖ్యమని ర్యాలీకి వచ్చానని తెలిపారు.
News December 14, 2025
MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.


