News February 19, 2025
పాలకొండకు జగన్ రాక రేపు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.
Similar News
News March 12, 2025
మందస: భార్య, కూతురు అదృశ్యం..కేసు నమోదు

మందస మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన పానిల సింహాచలం (27) తన భార్య జ్యోతి (22), కుమార్తె హన్విక (11నెలలు) కనిపించడం లేదంటూ..మంగళవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన నా భార్య, కూతురు మందస మండలం కొర్రాయి గేటు వద్ద బస్సు ఎక్కి కాశీబుగ్గ వచ్చారని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News March 12, 2025
నరసన్నపేట: చిట్ ఫండ్ అధినేత కోరాడ గణేష్ ఆస్తుల జప్తు

నరసన్నపేటలోని ‘లక్ష్మీ గణేష్ చిట్స్’ సంస్థకు చెందిన కోరాడ గణేశ్వరరావు చరాస్తులను జప్తు చేస్తూ హోం శాఖ జీవో నెం. 46 ద్వారా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కోరాడ గణేశ్వరరావు డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి రూ.5.86 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నరసన్నపేట స్టేషన్‌లో 2021లో కేసు నమోదైంది. 5.86 కోట్లు వరకూ దోచుకోగా కేవలం చరాస్తులు రూ.15.84 లక్షలు మాత్రమే గుర్తించారు.
News March 12, 2025
జి. సిగడాం: మూడు రోజుల తర్వాత బయటపడ్డ మృతదేహం

జి.సిగడాం మండలం దేవరవలస గ్రామానికి చెందిన కొడమాటి ఈశ్వరరావు, పద్మా దంపతుల కుమారుడు అశోక్ వత్సలవలస, రాజులమ్మ యాత్ర లో ఆదివారం సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించాడానికి వెళ్లి గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం సముద్ర తీరంలో మృతదేహం దొరికింది. ఈ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు దుఃఖానికి గురై విలవిలలాడుతున్నారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.