News April 17, 2025
పాలకొల్లు: చాంబర్స్ కళాశాలలో 17న మెగా జాబ్ మేళా

ఈనెల 17 గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి ,హెచ్డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి బ్యాంకింగ్, ఐటి, నాన్ ఐటీ సంస్థలకు చెందిన వారు 470 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.
Similar News
News April 19, 2025
వల్లూరులో సందడి చేసిన సినిమా యూనిట్

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మధురం’ చిత్ర యూనిట్ ఆచంట మండలం వల్లూరులో సందడి చేసింది. తాను తీసిన మొదటి సినిమాను ప్రేక్షకులు అందరూ విజయవంతం చేయాలని వల్లూరుకు చెందిన హీరో ఉదయ్ రాజ్ కోరారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరిగిందన్నారు. తనను ఆదరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
News April 19, 2025
భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన అడ్డాల చిన్న (24) భీమవరం రూరల్ మండలంలో లోసరి హైవేపై వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చిన్న హైదరాబాదులో జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడని, బైక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్తిపాడు వెళుతుండగా లోసరిలో ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు.
News April 19, 2025
ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.