News March 3, 2025
పాలకొల్లు: మాజీ మంత్రి జోగయ్యకు బన్నీ వాసు పరామర్శ

ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను ఆదివారం పాలకొల్లులో జనసేన నేత బన్నీ వాసు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. పలు రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోనం చినబాబు, శిడగం సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 3, 2025
రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలి: జేసీ

రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం మండలం చినమిరం గ్రామంలో 62 నెంబరు రేషను షాపును జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టరును, కార్డుదారులకు పంపిణీ చేసే రికార్డులను పరిశీలించారు. ఎండీయూ వాహనంపై సరుకుల వివరాలు రేట్లు పట్టికను పరిశీలించారు.
News March 3, 2025
ఏలూరు : పోస్టల్ బ్యాలెట్లో 42 చెల్లని ఓట్లు

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 గా సమాచారం.
News March 3, 2025
ప.గో : మద్యం దుకాణాలు బంద్

మరి కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వాటిని తెరిచే ప్రసక్తే లేదని ఎన్నికల అధికారి, కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టి, అల్లర్లకు కారకులైతే కఠిన చర్యలు తప్పవన్నారు.