News April 10, 2025
పాలకొల్లు : లవ్ మ్యారేజ్ ..మూడు నెలలకే ఆత్మహత్య

ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకొల్లులో జరిగింది. 28వ వార్డుకు చెందిన సతీశ్ మంగళవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News April 19, 2025
వల్లూరులో సందడి చేసిన సినిమా యూనిట్

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మధురం’ చిత్ర యూనిట్ ఆచంట మండలం వల్లూరులో సందడి చేసింది. తాను తీసిన మొదటి సినిమాను ప్రేక్షకులు అందరూ విజయవంతం చేయాలని వల్లూరుకు చెందిన హీరో ఉదయ్ రాజ్ కోరారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరిగిందన్నారు. తనను ఆదరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
News April 19, 2025
భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన అడ్డాల చిన్న (24) భీమవరం రూరల్ మండలంలో లోసరి హైవేపై వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చిన్న హైదరాబాదులో జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడని, బైక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్తిపాడు వెళుతుండగా లోసరిలో ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు.
News April 19, 2025
ప.గో : మెగా DSCలో మొత్తం పోస్టులు ఇవే..!

మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.