News April 5, 2025

పాలకోడేరు: అనుమానాస్ప స్థితిలో కానిస్టేబుల్ మృతి

image

పాలకోడేరు(M) శృంగవృక్షం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు(37) అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదైంది. ఆకివీడు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చారు. గురువారం అర్ధరాత్రి బాత్‌రూమ్‌కి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో భార్య వెళ్లి చూడగా స్పృహతప్పి ఉన్నారు. వైద్యునికి చూపించగా చనిపోయినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News April 6, 2025

ప.గో: తాగునీరు సమస్య లేకుండా ప్రణాళిక: జేసీ

image

వేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు తాగునీరు అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు.

News April 5, 2025

కాళ్ల: బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్

image

కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో భారతదేశ తొలి ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం కలెక్టర్ సి.నాగరాణి నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజంలో అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడని ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News April 5, 2025

ఆచంట: పాము కాటుతో వ్యక్తి మృతి

image

పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆచంట మండలం అయోధ్యలంకలో జరిగింది. ఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యలంకకు చెందిన శ్రీనివాసరావు గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన సమయంలో పాము కరిచింది. ఇంటికి వచ్చిన తర్వాత అతని నోటి నుంచి నురగ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

error: Content is protected !!