News April 1, 2025
పాలమూరు: ARMY జాబ్ కొట్టారు..!

నారాయణపేట జిల్లా బాపన్‌పల్లికి చెందిన గ్రామ యువకులు ఆనంద్, నవీన్, అనిల్, రవి ఆర్మీ జాబ్ సాధించారు. ఆర్మీ జాబ్ సాధించడంతో గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలోని యువకులందరూ గవర్నమెంట్ జాబ్స్ సాధించాలని తెలియజేశారు. ఆర్మీ జాబ్స్ సాధించి దేశానికి సేవ చేయడం ఎంతో ఆనందం కలిగించే విషయమని కొనియడారు.
Similar News
News April 3, 2025
టారిఫ్స్ పెంచేందుకు కారణమిదే..

అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్స్ పెంచడంతో ఆ దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు అగ్రరాజ్యానికి వస్తువులను ఎగుమతి చేయడం తగ్గిస్తాయి. ఫలితంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు పెరుగుతాయి. అక్కడి వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. కొన్నేళ్ల వరకు ధరలు పెరిగినా ట్రంప్ నిర్ణయం దీర్ఘకాలంలో ఆ దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకుల మాట.
News April 3, 2025
2026 T20WC వరకు టైట్ షెడ్యూల్

ఐపీఎల్ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానున్నారు. 2026 T20 WC వరకు టైట్ షెడ్యూల్ ఖరారైంది. జూన్-జులైలో ENGతో 5 టెస్టులు, SEPలో ఆసియా కప్, OCTలో వెస్టిండీస్‌తో 2 టెస్టులు, OCT-NOVలో AUSతో 3 ODI & 5 T20I, NOV-DECలో SAతో 2 Test, 3 ODI & 5 T20I, JANలో NZతో 3 ODI & 5 T20I, FEB-MARలో T20 వరల్డ్ కప్ ఆడనున్నారు.
News April 3, 2025
సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా పై హైకోర్టు మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కవితకు పునరావాసం కల్పించాలని కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పు ఇల్లీగల్ ఆర్డర్ అంటూ మహిళపై కలెక్టర్ కేసు బుక్ చేయించారు. దీంతో విషయాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.