News March 27, 2025

పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.

Similar News

News December 15, 2025

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: డీఈఓ

image

కంది మండలం ఉత్తరపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. పాఠశాలలో బోధన, విద్యార్థుల అభ్యాస స్థాయిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థుల చేత పాఠ్యాంశాలను చదివించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు.

News December 15, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

✒PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు:ఎస్పీలు
✒NGKL: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి
✒PHASE-3 పూర్తయ్యే వరకు MCC అమల్లోనే: ఎస్పీ
✒100% ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి:కలెక్టర్లు
✒PHASE-3 ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్లు
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒నూతన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యేలు
✒పోలింగ్ సామగ్రి పంపిణీ: కలెక్టర్లు

News December 15, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓తుది విడత ఎన్నికలకు ఏర్పాటు పూర్తి: కలెక్టర్
✓3వ విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
✓బూర్గంపాడు: ట్రాక్టర్ బోల్తా యువకుడు మృతి
✓జూలూరుపాడు గ్రామపంచాయతీకి ఎన్నికలు లేవు
✓ఓటును అమ్ముకోవద్దు అంటూ ఆళ్లపల్లిలో యువకుడి ప్రచారం
✓పుస్తకాల కోసం పీఓ రూ.45 వేల చెక్ అందజేత
✓భద్రాచలం: మహిళ ఆత్మహత్యాయత్నం సెల్ఫీ వీడియో
✓కౌలు రైతులు ఆన్లైన్ చేసుకోవాలి: పినపాక ఏఈఓ
✓రెండవ విడతలో 154 సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక