News January 1, 2025

పాలమూరు మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహం 

image

జడ్చర్ల పట్టణంలోని ఓ వృద్ధాశ్రమంలో మృతి చెందిన వృద్ధురాలు గొల్ల భీమమ్మ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు చిత్తనూరి రామకృష్ణ మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని మంగళవారం అప్పగించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న విద్యార్థులు మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 6, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి వార్తలు ఇవే.. డోంట్ మిస్ 

image

❤️హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్​లోకి నో ఎంట్రీ: వనపర్తి కలెక్టర్ బాదావత్ సంతోష్.❤️జీవితంలో సైన్స్ చాలా అవసరం:నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్.❤️కాలేజీ బాత్​రూమ్​లో కెమెరా కలకలం: పోలీసుల అదుపులో ఓ యువకుడు.❤️బొట్టు పెట్టి చెప్తున్నాం.. పేరెంట్స్‌‌‌‌ మీటింగ్‌‌‌‌కు రండి సింగోటంలో గ్రామస్తులను ఆహ్వానించిన టీచర్లు.❤️ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: ఎస్పీ గిరిధర్

News January 6, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు గణేశ్(30), రామకోటి(25)లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2025

MBNR: చేతులకు సంకెళ్లతో ఉద్యోగుల నిరసన

image

ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయ జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉద్యోగులు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. వారు తమ చేతులకు సంకెళ్లు వేసుకుని, ప్లకార్డులు పట్టుకొని ‘సంకెళ్లు తెంపండి.. రెగ్యులర్‌ చేయండి’ అనే నినాదంతో శిబిరంలో నినాదాలు హోరెత్తించారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.