News March 28, 2025
పాలమూరు: ‘వంద గజాల ప్లాటుకు రూ.3,81,26,542 LRS’

MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్‌కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.
Similar News
News April 2, 2025
నారాయణపేట: ‘విద్యార్థుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం’

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. యూనివర్సిటీలో భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ తరఫున విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూములు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గాలని సూచించారు.
News April 2, 2025
MNCL: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మంచిర్యాలలోని రాళ్లపేటకు చెందిన తెలంగాణ హోటల్ యజమాని ప్రభుదాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చిన ప్రభుదాస్‌ను భార్య మందలించగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంటికి వెళ్లని ఆయన ఇవాళ తెల్లవారుజామున హోటల్ పక్కన గల్లీలో ఒక ఇంటి ముందు సృహ కోల్పోయి ఉన్నారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. ఈ మేరకు ఎస్సై వినీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News April 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.