News March 25, 2025
పాలమూరుకు మరో మంత్రి పదవి..!

పాలమూరు జిల్లాకు మరో మంత్రి రానుందని టాక్. మక్తల్ MLA వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చ అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. మార్చి30న ఉగాది పండగ రోజు కొత్త మంత్రులు రానున్నారు.కాగా ఉమ్మడి MBNR నుంచి CM రేవంత్ రెడ్డి (కొడంగల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రులుగా ఉండగా శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరనుంది.
Similar News
News March 31, 2025
తెలంగాణలో అతి తక్కువ ద్రవ్యోల్బణం

TG: దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైనట్లు NSO తెలిపింది. రాష్ట్రంలో ఇది 1.3 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కేరళలో అత్యంత ఎక్కువ ద్రవ్యోల్బణం (7.3 శాతం) నమోదైనట్లు పేర్కొంది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ (4.9%), కర్ణాటక, బిహార్ (4.5%), జమ్మూ కశ్మీర్ (4.3%)లో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నట్లు పేర్కొంది. దేశంలోని 12 రాష్ట్రాలు 4 శాతం కంటే దిగువన ద్రవ్యోల్బణం నమోదు చేశాయి.
News March 31, 2025
రేపటి నుంచే ఇంటర్ తరగతులు

AP: రాష్ట్రంలో రేపటి నుంచే 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్‌లో చేరే వారికి 7వ తేదీ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులిస్తారు. జూన్ 2న తిరిగి క్లాసులు పున: ప్రారంభం కానున్నాయి. అలాగే జూ.కాలేజీల పని వేళలనూ ఉ.9గంటల నుంచి సా.5 వరకు పొడిగించి, 7 పీరియడ్లను 8 చేశారు.
News March 31, 2025
మెషిన్ కాఫీ తాగుతున్నారా?

రోజూ మెషిన్ కాఫీ తాగితే ఆరోగ్యానికి అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెఫీన్ బూస్ట్‌తో ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. మెషిన్ కాఫీలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కేఫ్ స్టోల్, కహ్వియోల్, డైటర్పీన్స్ గుండెపై ప్రభావం చూపుతాయి. ఇవి ఫిల్టర్ చేయవు కాబట్టి కొలెస్ట్రాల్ పదార్థాలు అలాగే ఉండిపోతాయి. రోజూ 3 కప్పులకంటే ఎక్కువగా తాగేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.