News March 30, 2025
పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం.. భట్టిVSపొంగులేటి

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం నియామకం Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య రాజకీయ ఆధిపత్యానికి దారి తీసింది. Dy.CM చొరవతో ఆలయ ఛైర్మన్‌గా జమ్ముల రాజశేఖర్, సభ్యులను నియమిస్తూ మార్చి 6న ఉత్తర్వులు వెలువడ్డాయి. తనకు తెలియకుండా ఎలా నియమిస్తారని మంత్రి సురేఖను పొంగులేటి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో లిస్టు రెడీ చేశారని.. పాలకవర్గం నియామకం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
Similar News
News April 2, 2025
మహనీయుల జయంతి వేడుకలను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం: డా. బాబు జగ్జీవన్ రామ్, డా.బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల జయంతి వేడుకలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహనీయుల జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయంతి వేడుకలలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ని సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.
News April 2, 2025
కోర్టు సినిమా హీరోను అభినందించిన ఎమ్మెల్యే

భద్రాచలం విచ్చేసిన కోర్టు మూవీ హీరో రోషన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. చిన్న వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించి కోర్టు మూవీ ద్వారా పెద్ద హిట్ కొట్టినందుకు అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సినిమా రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భద్రాచలం పట్టణాన్ని పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు.
News April 2, 2025
ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్లాస్టిక్ రహితం చేయాలి: కలెక్టర్

ఖమ్మం: ఏప్రిల్ నెలాఖరు నాటికి మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, ప్లాస్టిక్ నియంత్రణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరా నాణ్యత తనిఖీ చేయాలని పేర్కొన్నారు.