News February 6, 2025

పాల్వంచ రూరల్‌: లోన్ ఇస్తామంటూ మోసం..!

image

లోన్ రావాలంటే ముందు డిపాజిట్ చేయాలని మభ్యపెట్టి నగదు కాజేసిన ఘటన పాల్వంచ రూరల్ జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. తోగ్గూడెం గ్రామానికి చెందిన ఇర్ప మానస ఇటీవల ఫోన్ యాప్ ద్వారా లోన్ కోసం ప్రయత్నించింది. ముందుగా కొంత డబ్బు డిపాజిట్ చేస్తే రుణం వస్తుందని యాప్ నిర్వాహకులు నమ్మించారు. దీంతో ఆమె రూ.62,350 చెల్లించింది. ఆ తర్వాత ఆ యాప్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News February 6, 2025

అన్నమయ్య: రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదు

image

ఇటీవల వర్షాల కారణంగా సెలవులు ఇవ్వడం వల్ల పాఠశాల పని దినాలు 220 రోజులు కన్నా తక్కువ ఉన్నందున ఈనెల 8వ తేదీన రెండో శనివారం కూడా పాఠశాలలు పని దినంగా నిర్ణయించినట్లు డీఈవో బాలసుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి అన్నమయ్య జిల్లాలో రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని డీఈవో సూచించారు.

News February 6, 2025

నీటి ఎద్దడిపై చిత్తూరు కలెక్టర్ సమీక్ష 

image

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఈఓపీఆర్డీలతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అధికారులు నీటి ఎద్దడి గ్రామాల వివరాలను తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

News February 6, 2025

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో RRB, SSC బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 4నెలల ఉచిత శిక్షణ, బుక్ ఫండ్, ప్రతినెల స్టైఫండ్ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!