News April 12, 2024

పాల్వంచలో భారీ అగ్నిప్రమాదం

image

పాల్వంచ అంబేడ్కర్ సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోమొబైల్ వర్క్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే షాపు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 21, 2025

ఖమ్మం:ఓపెన్ పరీక్షలు..139గైర్హాజర్

image

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ  తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.

News April 21, 2025

కొత్తగూడెం: యువతికి వేధింపులు.. కేసు నమోదు

image

యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడిపై కేసు నమోదైంది. వైరా విప్పలమడుగుకి చెందిన రాహుల్‌ కొత్తగూడెంకు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి రాహుల్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇచ్చేసింది. అయితే డబ్బు పూర్తిగా ఇవ్వలేదని.. దానికి బదులుగా తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధిస్తున్నాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడెం సీఐ కరుణాకర్ తెలిపారు.

News April 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

image

∆}మధిరలో జాబ్ మేళా∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన  ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు

error: Content is protected !!