News April 21, 2025
పిట్టలవానిపాలెం: ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి

ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందిన ఘటన పిట్టలవానిపాలెం మండలంలో ఆదివారం చోటుచేసుకొంది. చందోలు ఎస్ఐ శివకుమార్ వివరాల మేరకు.. మండలంలోని అలకాపురంలో కనకా రెడ్డి ట్రాక్టర్‌తో రొయ్యల చెరువు కట్టను వెడల్పు చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడటంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News April 21, 2025
రేపు ఫలితాలు విడుదల?

UPSC సివిల్స్ తుది ఫలితాలు ఇవాళ లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. 1,056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, 2024 జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 20-29 వరకు మెయిన్స్, 2025 జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. దీంతో ఫలితాల విడుదలకు UPSC కసరత్తు చేస్తోంది.
News April 21, 2025
WGL: ప్రారంభమైన మార్కెట్.. అధిక ధర పలికిన పత్తి

మూడు రోజుల సుదీర్ఘ విరమం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలిరాగా భారీ ధర పలికింది. మూడు నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు క్వింటా పత్తి ధర రూ.7,560 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ధర భారీగా పలకడంతో రైతులకు ఊరట లభించినట్లు అయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News April 21, 2025
నారాయణపేట: OYO రూమ్‌లో యువకుడి సూసైడ్

NRPT జిల్లా గుండుమాల్ వాసి కుమ్మరి రాజేశ్(22) HYDలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమ్మరి రాజేశ్ HYD అంబర్‌పేట్ పరిధి రామ్‌నగర్‌లో ఉంటూ ప్రెవేట్ జాబ్ చేస్తూ పీజీ ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రేమ విఫలం కావడంతో రామ్‌నగర్‌లోని ఓయో హోటల్ రూమ్‌లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ బాలరాజ్ తెలిపారు.