News February 26, 2025
పిట్లం: కన్న తల్లిని చంపేశారు.. కారణమేంటో..?

నవమాసాలు మోసింది. పెంచి పెద్ద చేసింది. బిడ్డ కడుపు నిండితే తను సంతోషించింది. వృద్ధాప్యంలో తోడుగా నిలవాల్సిన తనయులె ఆ తల్లి పాలిట యముడయ్యారు. రోకలిబండతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లంలో మంగళవారం వెలుగు చూసింది. తల్లి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలే కారణంగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఎందుకు హత మార్చారో కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2025
సిద్దిపేట: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో మంగళవారం జరిగింది. సిద్దిపేట కోహెడ మండలం వరికోలుకు చెందిన అనూష భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈనెల 14న నిశ్చితార్థం కాగా మార్చి 6న పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో అనూష అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
News February 26, 2025
మండలాల వారీగా టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు..!

భద్రాద్రి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం 180, చుంచుపల్లి 188, లక్ష్మీదేవిపల్లి 89, సుజాతనగర్ 63, పాల్వంచ 247,చండ్రుగొండ 17, అన్నపురెడ్డిపల్లి 20, ములకలపల్లి 26, అశ్వరావుపేట 47, దమ్మపేట 76, అశ్వాపురం 37, ఆళ్లపల్లి 13, పినపాక 35, మణుగూరు 122, కరకగూడెం 19, గుండాల 13, ఇల్లెందు 218, టేకులపల్లి 134, భద్రాచలం 253, దుమ్ముగూడెం 61, చర్ల 51, బూర్గంపాడులో 57 మంది ఓటర్లున్నారు.
News February 26, 2025
పాండవులు నిర్మించిన క్షేత్రం కేదార్‌నాథ్

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉత్తరాఖండ్‌లోని <<15578815>>కేదార్‌నాథ్<<>> క్షేత్రం 11వది. మహాభారత యుద్ధం తర్వాత వ్యాసమహర్షి సలహా ప్రకారం, పాండవులంతా కేదార్‌నాథ్ వెళ్లి శివుని ఆలయం నిర్మించి, క్షమాపణ కోరుతూ తపస్సు చేశారని స్థలపురాణం చెబుతోంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడే నిర్వాణం పొందారు. విపరీతమైన మంచు కారణంగా ఈ మందిరం ఏప్రిల్- నవంబర్‌ల మధ్యే తెరిచి ఉంటుంది. కాలినడకన, గుర్రాలు, డోలీలపై ఈ ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.