News June 11, 2024
పిట్లం: భార్యను ఉరేసి చంపిన భర్త

కుటుంబ కలహాల కారణంగా భర్యను చంపేశాడో భర్త. పిట్లం మండలంలోని గద్ద గుండు తండాకు చెందిన బూలి బాయి, అంబ్రియ నాయక్ భార్యాభర్తలు. అయితే బూలి బాయికి కొన్నేళ్లుగా ఆరోగ్యం బాగా లేక భర్త పట్టించుకోలేదు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో అంబ్రియ నాయక్ మంగళవారం భార్యను ఉరేసి చంపేశాడు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 19, 2025
NZB: సోమవారం నుంచి యథావిధిగా ప్రజావాణి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు.
News December 19, 2025
NZB: 20న కలెక్టరేట్‌లో ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమం: కలెక్టర్

వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమం ‘ మీ డబ్బు- మీ హక్కు’ లో భాగంగా ఈ నెల 20న కలెక్టరేట్ లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.
News December 19, 2025
TU: డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్

టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వన్ టైమ్ ఎగ్జామ్స్ ఛాన్స్ ఇచ్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016 నుంచి 2020 వరకు విద్యనభ్యసించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల విద్యార్థులు 1,2,3,4,5,6 సెమిస్టర్ పరీక్షలు రాసుకోవచ్చు అని వెల్లడించారు. జనవరి 3 లోపు ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.


