News February 26, 2025
పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు..!

కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం(60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 26, 2025
అనకాపల్లి నుంచి పోలింగ్ కేంద్రాలకు పయనం

అనకాపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రితో ఎన్నికల అధికారులు సిబ్బంది పోలీస్ కేంద్రాలకు బుధవారం బయలుదేరారు. 24 పోలింగ్ కేంద్రాలకు 10 రూట్లలలో 10 బస్సులను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 24 పోలింగ్ కేంద్రాలకు వీరంతా సాయంత్రానికి చేరుకుంటారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్, మరో ఇద్దరు పోలింగ్ అధికారులను నియమించారు.
News February 26, 2025
రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం: ఉత్తమ్

TG: SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. SLBC పూడికలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని వెల్లడించారు. సమగ్ర ప్రణాళికతో తాము ముందుకెళ్తున్నామని, గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి దెబ్బ తిన్న TBMను వేరు చేస్తామని పేర్కొన్నారు.
News February 26, 2025
సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ కీలక సూచనలు

TGలో 2016 నుంచి పీఎం ఆవాస్ యోజనను ఎందుకు అమలు చేయడం లేదని సీఎం రేవంత్‌ను ప్రధాని మోదీ ప్రశ్నించారు. మార్చి 31 నాటికి ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల లిస్టును సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. 2017 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లకు, రెండు రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని, 3 నీటి పారుదల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.