News October 31, 2024
పిఠాపురం: ‘ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం’
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభవాళి దీపావళి అని అభివర్ణించారు. దీపాల శోభతో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అనాదిగా వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలకు సకల శుభాలను ఆనందాన్ని కలుగజేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రం దీపాల వలె వెలగాలని కోరారు.
Similar News
News November 28, 2024
తూ.గో: ముమ్మరంగా వాహనాల తనిఖీలు
తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో గురువారం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ముఖ్య కూడళ్లలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు కోరారు.
News November 28, 2024
రాజానగరం: 29న పీజీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్
నన్నయ విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎం.ఏ, ఎం.కామ్, ఎంపీఈడీ, ఎంఎస్సీ కోర్సుల్లో భర్తీ చేయని సీట్లకు 29న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని వీసీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ పీజీసెట్ రాయకపోయినా, రాసి అర్హత సాధించకపోయినా స్పాట్ అడ్మిషన్‌లో పీజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చన్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత శాతం ఓసీ, బీసీలకు 50శాతం, ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం సాధించిన వారు అర్హులన్నారు.
News November 28, 2024
రేపు ఉమ్మడి తూ.గో జిల్లాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు కాకినాడ, కోనసీమ,తూ.గో జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.