News April 6, 2025
పిఠాపురం: రాముడు చెంతకు రామచిలుక

పిఠాపురం పట్టణం చిట్టోడి తోటలో కొలువైన విద్యా గణపతి శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం జరుగుతుండగా అద్బుత సంఘటన చోటు చేసుకుంది. రామచిలక రాముడి వద్దకు చేరుకుంది. కళ్యాణ మహోత్సవం జరుగుతుండగా రాముల వారి విగ్రహం ఎడమ భుజంపై వాలి కళ్యాణ మహోత్సవం జరిగేంత వరకు ఉంది. ఇదే దేవాలయంలో పది సంవత్సరాల క్రితం కళ్యాణ మహోత్సవానికి రామచిలక వచ్చిందని స్థానిక ప్రజలు తెలిపారు.
Similar News
News April 17, 2025
పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, DGPలను ఆదేశించింది. ప్రవీణ్ మృతిపై దర్యాప్తును CBIకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ప్రవీణ్‌ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని పాల్ ఆరోపిస్తున్నారు.
News April 17, 2025
రిమాండ్ పొడిగింపు.. రాజమండ్రి జైలుకి అనిల్

వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగిస్తూ నరసారావుపేటలోని రెండో అదనపు న్యాయాధికారి గాయ్రతి ఉత్తర్వులు ఇవ్వడంతో అతడిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. సీఎం, Dy.CM, లోకేశ్‌లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
News April 17, 2025
ఆదోనిలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాను ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.10 లక్షల నగదు, 350 లీటర్ల డీజిల్, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇప్పటి వరకు 10,620 లీటర్ల డీజిల్ దొంగతనానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ అపరేషన్‌ను ఆదోని SDPO హేమలత పర్యవేక్షణలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీరాం విజయవంతంగా నిర్వహించారు.