News February 11, 2025

పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా మహిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాలల సంక్షేమం, రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల సంక్షేమం, రక్షణ అందించుటలో ప్రభుత్వ శాఖలన్నీ కార్యాచరణ ప్రణాళికతో పని చేయాలన్నారు. మండల స్థాయిలో పిల్లల రక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News March 15, 2025

శుభ ముహూర్తం (15-03-2025)

image

☛ తిథి: బహుళ పాడ్యమి మ.12.59 వరకు
☛ నక్షత్రం: ఉత్తర ఉ.7.43 తదుపరి హస్త
☛ శుభ సమయం: ఉ.11.56 నుండి 12.32 వరకు
☛ రాహుకాలం: మ.9.00-10.30 వరకు
☛ యమగండం: మ.1.30-3.00 వరకు
☛1.దుర్ముహూర్తం: .ఉ.6.00-7.36 వరకు
☛ వర్జ్యం: సా.4.57నుండి6.42 వరకు
☛ అమృత ఘడియలు: లేదు

News March 15, 2025

బాపట్ల జిల్లా కలెక్టర్ సూచనలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమం శనివారం సూర్యలంక బీచ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పాల్గొంటున్నట్లు కలెక్టర్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.

News March 15, 2025

విజయవాడ: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

image

ఈ నెల 21వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ నటించిన సలార్ చిత్రాన్ని విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం విజయవాడలోని 8 థియేటర్లలో రీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు సినీ అభిమానులను ఉర్రూతలూగించాయి.

error: Content is protected !!