News February 7, 2025

పీఎం స్కూల్ కింద 30 పాఠశాలలు ఎంపిక: VKB కలెక్టర్

image

జిల్లాలో ప్రధాన మంత్రి స్కూల్స్ పర్ రైసింగ్ ఇండియా స్కీం కింద 30 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 30 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంపికైన పాఠశాలల్లో కనీస సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Similar News

News February 7, 2025

MHBD: మిర్చి రైతుకు మిగిలిన కన్నీళ్లు..!

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మిర్చి పంట వేయడానికి రైతులు మక్కువ చూపుతారు. ఎంతో కష్టపడి పండించిన మిర్చి పంటకు ఈ సంవత్సరం గిట్టుబాటు ధర రాక రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గత సంవత్సరం గరిష్ఠంగా క్వింటా రూ.20- 23 వేల మధ్య ఉన్న ధర, ప్రస్తుతం రూ.12-14 వేలు చెల్లిస్తున్నారు. అయితే తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గుతూ, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు మనోవేదనకు గురవుతున్నారు.

News February 7, 2025

కరీంనగర్: రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని రైతు మృతి

image

కొత్తపల్లి శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన రైతు జంగిలి అంజయ్య(65) మృతి చెందారు. కొత్తపల్లి సంతకు వచ్చి సామగ్రిని కొనుగోలు చేసి తిరిగి సైకిల్‌పై వెలిచాల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజయ్య తీవ్రగాయాలతో మృతి చెందారు. అంజయ్య మృతదేహాన్ని KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చూరీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.

News February 7, 2025

NZB: ఆస్తి పన్ను వసూలు చేయాలి: కమిషనర్

image

నిర్లక్ష్యం చేయకుండా నగరంలో ఆస్తి పన్ను వసూలు చేయాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. ఆయన నగరపాలక సంస్థ స్పెషల్ టీం ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ సిబ్బందితో సమావేశమై ఆస్తిపన్ను విషయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీగా పెండింగ్లో ఉన్న వారి నుంచి త్వరితగతిన పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు.

error: Content is protected !!