News February 12, 2025
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353645527_50031802-normal-WIFI.webp)
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ తన హక్కును కోరడాన్ని చిన్నచూపుగా అభివర్ణించడం బాధాకరమని మంత్రి అన్నారు. దేశానికి భారీగా ఆదాయం అందిస్తున్న తెలంగాణకు తగిన న్యాయం జరగాలని కోరడం న్యాయమేనని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గుర్తించి, వాటి అభివృద్ధికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
Similar News
News February 12, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739374097420_19535177-normal-WIFI.webp)
✓ బర్డ్ ఫ్లూ.. భద్రాద్రి జిల్లా సరిహద్దులు అప్రమత్తం ✓ చర్ల: 30 ఏళ్లుగా ఆ బడికి టీచర్ లేరు ✓ జేఈఈ మెయిన్స్‌లో గుండాల విద్యార్థుల ప్రతిభ ✓ రోడ్డు ప్రమాదంలో అశ్వాపురంలో యువకుడి మృతి ✓ RSS చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను ఖండించిన కూనంనేని ✓ జిల్లాలో శివరాత్రి వేడుకలకు ఆలయాల ముస్తాబు ✓ చర్ల: 6 గ్యారంటీలు అమలు చేయాలి: CPIML న్యూడెమోక్రసీ ✓ మణుగూరులో కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వ్యక్తికి రిమాండ్.
News February 12, 2025
కొత్త 50 రూపాయల నోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372887723_653-normal-WIFI.webp)
ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త రూ.50 నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
News February 12, 2025
రామగుండం: వారం వ్యవధిలో తనువు చాలించిన భార్యాభర్తలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739377934377_50226861-normal-WIFI.webp)
తనువు ఆ తర్వాత మనువు తో కలిసిన ఆ బంధం కట్టే కాలే వరకు కొనసాగింది. 4 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీ నగర్కు చెందిన ఆకునూరి లక్ష్మి ఈనెల 2న మరణించగా 4 రోజుల వ్యవధిలో భర్త ఆకునూరి దుర్గయ్య తనువు చాలించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కుటుంబం లో విషాదాన్ని మిగిల్చింది.