News May 21, 2024

పుంగనూరులో ఓట్లు లెక్కింపు ఇలా..!

image

పుంగనూరులో 2,38,868 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,06, 916 ఓట్లు పోలయ్యాయి. వచ్చే నెల 4వ తేదీన వీటిని లెక్కిస్తారు. ముందుగా పుంగనూరు మండలం ఎర్రగుంట్లపల్లి పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత చౌడేపల్లె, సదుం, సోమల, రొంపిచెర్ల మండలాల ఈవీఎంలు తెరుస్తారు. చివరగా పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి ఓట్లతో పుంగనూరు నియోజకవర్గ కౌంటింగ్ ముగుస్తుంది.

Similar News

News December 25, 2024

అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన

image

తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.’ అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు.

News December 25, 2024

తిరుపతి: వైకుంఠ ఏకాదశికి పటిష్ఠ బందోబస్తు

image

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో తోపులాటలు చోటు చేసుకోకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించేలా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి క్యూ లైన్లలో తోపులాటలు జరపకుండా టోకెన్లు పొందాలని సూచించారు. టీటీడీ, పోలీసుల సూచనలు పాటించాలన్నారు.

News December 25, 2024

చిత్తూరు: వార్షిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ

image

చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మణికంఠ వార్షిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరించాలన్నారు. చోరీలకు అడ్డకట్టవేసేలా నిఘా పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేశారు.