News December 23, 2024
పుట్టపర్తిలో డ్రోన్ కెమెరాలతో నిఘా
పుట్టపర్తి గ్రామీణ ప్రాంతాలలోని నిర్మానుష్య ప్రదేశాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతాలైన అమకొండపాళ్యం, వెంగళమ్మ చెరువు పరిసర ప్రాంతాలతో పోలీసులు ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం తాగటం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ జరగకుండా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ పెట్టారు.
Similar News
News December 23, 2024
అల్లు అర్జున్‌పై ఏసీపీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత
హీరో అల్లు అర్జున్‌పై ఏసీపీ విష్ణుమూర్తి చేసిన వ్యాఖ్యలను BJP నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ‘వీధి రౌడీ భాషలో ఒక పోలీస్ అధికారి మీడియా ముందు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం తప్పు కాదా? విష్ణుమూర్తి ఇలా మాట్లాడేందుకు తెలంగాణ డీజీపీ అనుమతి ఇచ్చారా? తెలంగాణలో అల్లు అర్జున్‌కు ఆధార్ కార్డుందా అని ప్రశ్నించడానికి అతనెవరు?’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.
News December 23, 2024
అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన పరిటాల శ్రీరామ్
బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎరుకల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. కార్యకర్తను విడుదల చేయించారు. కాగా జనసేన నాయకుల ఒత్తిడితోనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.
News December 22, 2024
ప్రజా సమస్యలపై రేపు అర్జీలు స్వీకరిస్తాం: ఇన్ఛార్జ్ కలెక్టర్
ప్రజా సమస్యలపై రేపు (సోమవారం) అర్జీలు స్వీకరిస్తామని అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ వెల్లడించారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమం ఉంటునాదన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాలని కోరారు.