News April 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 17, 2025

10 గంటల ముందే రిజర్వేషన్ చార్టులు: రైల్వే బోర్డు

image

రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్టులు అందుబాటులో ఉంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. ఇన్నాళ్లూ 4 గంటల ముందు చార్టును అందుబాటులో ఉంచేది. దీంతో స్టేషన్‌కు రావడం, ట్రావెల్ ప్లాన్ చేసుకోవడం వంటి ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ఈ నిర్ణయం ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు.

News December 17, 2025

పొలాల దగ్గర గినీ కోళ్లను ఎందుకు పెంచుతారు?

image

గినీ కోళ్లు చాలా చురుగ్గా ఉండి చిన్న అలికిడి అయినా వెంటనే స్పందిస్తాయి. కొత్త వ్యక్తులు, జంతువులు వస్తే ఇవి గట్టిగా అరుస్తూ రైతులను అలర్ట్ చేస్తాయి. ఇవి బాగా పరిగెత్తగలవు. పొలం చుట్టుపక్కల ఉన్న పాములను గుర్తించి చంపుతాయి. ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. అందుకే పొలాలు, ఇంటి పరిసరాల్లో ఎలుకలు, పాములు, పురుగులు, ఇతర కీటకాల నివారణకు చాలా మంది రైతులు ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు.

News December 17, 2025

మెస్సీకి అంబానీ గిఫ్ట్.. ఖరీదు ఎంతో తెలుసా?

image

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ నిన్న గుజరాత్‌లోని <<18586214>>వనతార<<>>ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ అరుదైన బహుమతి ఇచ్చారు. రిచర్డ్ మిల్లీ RM 003 V2 వాచ్‌ను బహూకరించారు. దీని విలువ దాదాపు రూ.10.91 కోట్లు కావడం గమనార్హం. ఈ లిమిటెడ్ ఆసియా ఎడిషన్ వాచ్‌లు ప్రపంచంలో 12 మాత్రమే ఉన్నాయి. ‘గోట్ టూర్’లో భాగంగా ఈ నెల 13-16 తేదీల్లో ఇండియాలో మెస్సీ పర్యటించారు.