News February 10, 2025
పులిగుండాల అందాలు చూడతరమా..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739120639377_1280-normal-WIFI.webp)
ఖమ్మం జిల్లా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతమైన పులిగుండాలను ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్, చెరువులో బోటింగ్, రాత్రిళ్లు నక్షత్రాల వ్యూ, క్యాంపులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పర్యాటక పనులు త్వరగా పూర్తి చేస్తే జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు.
Similar News
News February 11, 2025
ఖమ్మం: బంగారు గుడ్డు పెట్టే బాతును చంపకండి: ఎంపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739206843242_718-normal-WIFI.webp)
కేంద్ర బడ్జెట్‌లో తమ తెలంగాణ ప్రజలను ఎందుకు పట్టించుకోలేదని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేటాయింపుల్లో నిర్లక్ష్యం ఎందుకని లోక్ సభలో ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారని, పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం ఇస్తున్నా కేటాయింపులు చేయలేదని తెలిపారు. బంగారు గుడ్డు పెట్టే బాతును చంపకండి అని హితవు పలికారు.
News February 11, 2025
ఖమ్మం: తీన్మార్ మల్లన్నకు థ్యాంక్స్: సుందర్ రాజ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739189225036_50241694-normal-WIFI.webp)
ఖమ్మం-వరంగల్-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ తనను గెలిపించాలని ఆయన కోరారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న తనకు మద్దతు తెలపడంపై చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జాతీయ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఉన్నారు.
News February 11, 2025
కొత్తగూడెం: నిర్మానుష్య ప్రదేశంలో గాయాలతో యువతి..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739207456434_718-normal-WIFI.webp)
లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి జాతీయ ప్రధాన రహదారి పక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువతి గాయాలతో పడి ఉందని స్థానికులు తెలిపారు. గుత్తి కోయ యువతిగా స్థానికులు గుర్తించారు. ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికుల సమాచారంతో ఎస్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.