News September 6, 2024

పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద

image

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేయటంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ అధికారులు 8గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1.68 లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1.91 క్యూసెక్కులుగా ఉంది.

Similar News

News November 28, 2024

వేమూరు: రూ.20 వేల జీతంతో ఉద్యోగాలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం, సీడ్ ఆప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వేమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రణయ్ బుధవారం తెలిపారు. మైక్రోసాఫ్ట్ సొల్యూషన్స్, కేఎల్ గ్రూప్, మెడ్ ప్లస్ ఫార్మసీ, ఏయూ బ్యాంక్ కంపెనీలు హాజరవుతాయని వందకు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. వేతనం రూ.10 నుంచి 20వేల వరకు ఉంటుందన్నారు.

News November 28, 2024

గుంటూరు: లోకేశ్ ప్రతిపాదనపై మీరేం అంటారు?

image

గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై బుధవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. గంజాయి వాడే కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీని సాధ్యాసాధ్యాలపై క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మరి ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? కామెంట్ చేయండి.

News November 28, 2024

ఉద్యోగాల కల్పనే అంతిమ లక్ష్యం: మంత్రి లోకేశ్

image

స్కిల్ సెన్సస్ నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సస్ అంతిమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సస్, స్కిల్ డెవలప్ మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో లోకేశ్ బుధవారం సమీక్షించారు. ఎసెస్మెంట్ చేయకుండా కేవలం సెన్సస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రిఎసెస్ మెంట్ కూడా వేగంగా పూర్తిచేయాలని అన్నారు.