News April 13, 2025
పులిచెర్ల: బావిలో పడి 12 ఏళ్ల బాలుడి మృతి

పులిచెర్ల మండలంలో విషాదం నెలకొంది. అయ్యవారిపల్లెకు చెందిన సురేశ్-లత దంపతుల కుమారుడు దిలీప్ (12) శనివారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. వారు బెంగళూరు నుంచి ఉగాదికి స్వగ్రామానికి వచ్చారు. పొలం వద్ద చెల్లెలితో దిలీప్ ఆడుకుంటుండగా పొరపాటున బాల్ బావిలో పడింది. దాన్ని తీసుకునేందుకు వెళ్లిన దిలీప్ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News April 24, 2025
చిత్తూరు: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు కొత్త సిలబస్

2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌కు నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు DIEO శ్రీనివాస్ గురువారం తెలిపారు. కన్నన్ కళాశాలలో అధ్యాపకులకు దీనిపై ఓరియంటేషన్ తరగతులు ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఈ తరగతులకు హాజరై నూతన సిలబస్‌పైన అవగాహన పెంచుకోవాలన్నారు. కళాశాల పునఃప్రారంభం నాటికి నూతన పుస్తకాలు అందుబాటులోకి తెస్తామన్నారు.
News April 24, 2025
వైసీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం:రోజా

విజయపురం(మ) ఎం.అగరంలో వైసీపీ సర్పంచ్ సుధాకర్‌పై హత్యాయత్నం జరిగిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ‘X’ వేదికగా మండిపడ్డారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
News April 24, 2025
చిత్తూరు: DIEOగా శ్రీనివాస్ బాధ్యతలు

చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిగా ఆదూరి శ్రీనివాస్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఈయన నెల్లూరు బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ రెగ్యులర్ పదోన్నతిపై DIEOగా చిత్తూరుకు వచ్చారు. అందరి సహకారంతో జూనియర్ కళాశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.