News March 23, 2024
పులివర్తి నాని కారుకు ప్రమాదం

చంద్రబాబు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్తున్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు వద్ద కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులివర్తి నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News April 20, 2025
చిత్తూరు జిల్లాలో వేసవి తాపం

చిత్తూరు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం 41 డిగ్రీలకు పెరిగాయి. నగరిలో 41.4, శ్రీరంగ రాజపురం, తవణంపల్లె మండలాల్లో 41.2, గుడిపాల, చిత్తూరు మండలాల్లో 40.8, యాదమరిలో 40.3, గంగాధరనెల్లూరులో 40.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగారుపాళ్యంలో 38.6, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచెర్ల, వెదురుకుప్పం మండలాల్లో 38.1, చౌడేపల్లె, ఐరాల, కార్వేటినగరం, నిండ్ర, పాలసముద్రంలో 37.7 డిగ్రీలు నమోదైంది.
News April 20, 2025
సదుం: అధికారుల తీరుతో విసిగి ACBకి ఫిర్యాదు

రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు షఫీ ఉల్లా తెలిపారు. తనకు సంబంధించిన 5.60 ఎకరాల సెటిల్మెంట్ భూమిని అధికారులు అసైన్మెంట్‌గా మార్పు చేశారని.. తిరిగి దానిని సెటిల్మెంట్‌గా నమోదు చేసేందుకు రూ.1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని ఆయన వాపోయారు. దానిని చెల్లించేందుకు ఇష్టం లేకనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి తాహశీల్దార్, వీఆర్ఓలను పట్టించినట్లు చెప్పారు.
News April 20, 2025
చిత్తూరు: రైలు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి

గంగాధరనెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లికి చెందిన హేమాద్రి ఆచారి కుమారుడు ప్రవీణ్ కుమార్ శనివారం రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలులో పూతలపట్టు సమీపంలోని ముత్తురేవులు వద్ద జారిపడి మృతి చెందాడు. తండ్రి సైతం జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జీడీ నెల్లూరు గ్రామంలో, కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.