News January 14, 2025

పులివెందులలో జోరుగా కోళ్ల పందేలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని పులివెందులలో తొలిసారి జోరుగా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని ఉలిమెల్ల, మండలంలోని ఈ.కొత్తపల్లి, ఎర్రిపల్లె తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో తొలిరోజే రూ.2 కోట్లకు పందేలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందులలో 8 చోట్ల బరులు ఏర్పాటు చేయగా.. లింగాల మండలంలోనే దాదాపు రూ. 50 లక్షలకు పందేలు జరిగినట్లు సమాచారం.

Similar News

News January 15, 2025

కడప రెగ్యులర్ RJDగా శామ్యూల్

image

కడప రెగ్యులర్ RJD (పాఠశాల విద్యాశాఖ)గా కె.శామ్యూల్ నియమితులయ్యారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న కె.శామ్యూల్ కడప జిల్లా RJDగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కడప జిల్లా RJDగా తన విధులను నిర్వహించనున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని వారు తెలిపారు.

News January 15, 2025

కడప: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంక్రాంతి వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయము నందు బంగ్లాకు విచ్చేసిన గంగిరెద్దుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ దంపతులు సాంప్రదాయ బద్దంగా నూతన వస్త్రాలు సమర్పించారు.

News January 14, 2025

బద్వేల్: సంక్రాంతి పండుగ రోజు విషాదం

image

బద్వేలు మండలం గుండంరాజుపల్లె సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై నుంచి అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రవికుమార్ విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.