News February 9, 2025
పులివెందులలో పులి కలకలం.. వాస్తవం ఇదే.!

పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో పులి అడుగులు కనిపించాయని వార్తలు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు శనివారం రాత్రి పొలాల్లో పర్యటించారు. గ్రామస్థులతో కలిసి పులి సంచరిస్తుందని చెప్పిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ అడుగులు పులివి కావని నిర్ధారించారు. ఈ తనిఖీల్లో సీఐ నరసింహులు, ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 13, 2025
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కడప కలెక్టర్

కడప జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకు సంబంధించి పనుల అనుమతులను జాప్యం చేయక సంబంధిత అధికారులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రెవెన్యూ సదస్సులు, గ్రామ సభలు, పౌర సరఫరాల పంపిణీ తదితరులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు ఎలాంటి జాప్యానికి తావివ్వక వెంటనే దరకాస్తును పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వాలన్నారు.
News March 13, 2025
కడప: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

కడప జిల్లాలోని కాశినాయన క్షేత్రంలోని పలు షెడ్లను అటవీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ, కూటమి నాయకులు వాడీవేడీగా మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించి.. తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 24 గంటల్లో ఇచ్చిన మాట ప్రకారం.. నూతన షెడ్ల నిర్మాణం పనులను మొదలుపెట్టారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News March 13, 2025
కడపలో చదువుల తల్లి ఇక లేదు

కడపలో బుధవారం హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. కడపకు చెందిన ఆయేషా ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బుధవారం ఫిజిక్స్ రాస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే సిబ్బంది దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆయేషా పదో తరగతిలో 592, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 425 మార్కులు సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు.