News March 5, 2025
పెంచికల్పేట్: అనుమానంతోనే హత్య చేశాడు: CI

లోడుపల్లికి చెందిన గుర్లే లలిత పంట చేనులో హత్య విషయం తెలిసిందే. CI శ్రీనివాసరావు, SI కొమురయ్య కథనం ప్రకారం.. భర్త గణేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆదివారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. పథకం ప్రకారం మామిడి తోటలో ఆమెను తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులకు ఎదుట అంగీకరించాడు.
Similar News
News March 5, 2025
TTD Update: నేరుగా శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తోంది. నిన్న శ్రీవారిని 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.65 కోట్ల ఆదాయం సమకూరింది.
News March 5, 2025
సీసీ కుంట: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి

సీసీకుంట మండలం గూడూర్ గ్రామ శివారులో బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అమరచింత మం. మస్థిపురానికి చెందిన గుండమ్మ(77) కురుమూర్తి స్వామి దర్శనానికి గతనెల 28న వెళ్లింది. ఆలయ పరిసరాల్లో అటుఇటు తచ్చాడుతూ పలువురికి కనిపించింది. ఇంతలోనే బావిలో ఆమె మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
News March 5, 2025
ఐదు నెలల క్రితమే వివాహం.. ఇంతలోనే విషాదం

కార్వేటినగరం(మం)లో విషాదం నెలకొంది. ఆళత్తూరు వాసి శ్రావణ్ తన ఫ్రెండ్ చెన్నకేశవులతో కలిసి ఓ పుట్టిన రోజు వేడుకకు కొల్లాంగుట్టకు బైకు మీద వెళ్లారు. తిరిగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బైకును కొల్లాగుంట చెక్ పోస్ట్ సమీపంలో మరో బైకు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రావణ్‌కు ఐదు నెలల క్రితమే వివాహం కాగా.. ఆమె గర్భిణి.