News March 23, 2025
పెంచికల్పేట్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: MLC

మారుమూల గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని MLC దండే విఠల్ పేర్కొన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్లకు ఆదివారం ఎమ్మెల్సీ దండే విఠల్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, దారుగపల్లి, చేడువాయి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News March 26, 2025
అమ్మలూ.. హ్యాపీ బర్త్‌డే: NTR

టాలీవుడ్ స్టార్ హీరో Jr.NTR తన సతీమణి లక్ష్మీ ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అమ్మలూ.. హ్యాపీ బర్త్ డే’ అని విషెస్ తెలియజేశారు. ‘దేవర’ సినిమా రిలీజ్ సందర్భంగా వీరు ప్రస్తుతం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం 2011లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్ ఉన్నారు.
News March 26, 2025
రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి కాలం ప్రారంభంలోనే ఈ స్థాయిలో భానుడు విరుచుకుపడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, కొద్దిరోజులుగా నంద్యాల జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
News March 26, 2025
నిర్మల్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో నేడు ఇఫ్తార్ విందు

నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ముస్లిం పోలీసు సిబ్బందికి బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ఇఫ్తార్ విందులో ముస్లిం పోలీసులు పాల్గొనాలని కోరారు.