News November 20, 2024
పెండింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి: కడప కలెక్టర్
కడప జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. జిల్లాలో 2389 అంగన్వాడీ కేంద్రాలున్నాయని, వాటిలో 378 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలలో ఉన్నాయన్నారు.
Similar News
News December 3, 2024
కడప జిల్లాలో మరో దారుణ హత్య
కడప జిల్లాలో వరుస హత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొద్దుటూరులోని ఓ లాడ్జీలో సోమవారం కొప్పుల రాఘవేంద్ర అనే రౌడీషీటర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అదేరోజు దువ్వూరు మండలం కానగూడూరులో తండ్రి మహబూబ్ బాషా చేతిలో కొడుకు పీరయ్య గారి హుస్సేన్ బాష (23) హత్యకు గురయ్యాడు. రోకలి బడెతో తలపై కొట్టాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాషా మృతి చెందాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 3, 2024
అన్నమయ్య: సాయుధ దళాల దినోత్సవ స్టికర్ల ఆవిష్కరణ
డిసెంబర్ 7న సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్ ఫ్లాగ్‌లు, స్టిక్కర్లను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయుధ దళాల త్యాగాలు, సేవలను గుర్తించేందుకు జెండా దినోత్సవం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అన్నారు. మాజీ సైనికులు, వీరనారులు వారి కుటుంబాల సంక్షేమానికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News December 2, 2024
ప్రొద్దుటూరు: లాడ్జీలో దారుణ హత్య
ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జీలో సోమవారం ఉదయం దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేసి ఉండచ్చని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతునికి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.