News December 13, 2024
పెద్ద పులులకు అడ్డా మన భద్రాద్రి.. మీకు తెలుసా..?
గుండాల, కరకగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా గతంలో గుండాల, పాండవులు గుట్ట, ఇల్లందులో పెద్ద పులులు సంచరించేవని స్థానికులు చెబుతున్నారు. 2000 సం. NOVలో ఈ ప్రాంతంలో పెద్ద పులి ఆవులపై దాడి చేసిందన్నారు. రెండు దశాబ్దాల తర్వాత 2020లో ఒకసారి, 2022లో మరోసారి సంచరించాయన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత పులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 27, 2024
ఇల్లందు – కారేపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం
సింగరేణి మండల పరిధిలోని ఇల్లందు – కారేపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వ్యక్తిని ఉసిరికాయలపల్లికి చెందిన మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి పట్ల పొంగులేటి సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు పొంగులేటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని కొనియాడారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి పట్ల భట్టి సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు.’గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాయి. మన్మోహన్ సింగ్ అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప మేధావిని కోల్పోయింది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.