News February 4, 2025

పెద్దపల్లి: 2 లక్షలకుపైగా విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు: కలెక్టర్

image

19 ఏళ్లలోపు ప్రతిఒక్కరికి నులి పురుగుల నివారణ మాత్రలను అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ సూచించారు. ఈనెల 10 నుంచి 17 వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, కాలేజీలలో 2 లక్షలకుపైగా విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 4, 2025

రతన్ టాటా యువ స్నేహితుడికి కీలక పదవి

image

దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా కంపెనీలో కీలక పదవి దక్కింది. స్ట్రాటజీస్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, GMగా నియమితులైనట్లు శంతను LinkedInలో పోస్ట్ చేశారు. తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్‌లో పని చేసేటప్పుడు వైట్ షర్ట్, నేవీ కలర్ ఫ్యాంట్ ధరించేవారని పేర్కొన్నారు. ఆయన కోసం తాను కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేవాడినని చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

News February 4, 2025

BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!