News March 16, 2025

పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

image

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News March 16, 2025

KKRకు బిగ్ షాక్

image

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌కు దూరమయ్యారు. ఆయన స్థానంలో చేతన్ సకారియాను భర్తీ చేయనున్నారు. చేతన్‌కు KKR రూ.75 లక్షలు చెల్లించనుంది. ఇప్పటివరకు 19 మ్యాచులు ఆడిన సకరియా 20 వికెట్లు తీశారు.

News March 16, 2025

పార్టీ కమిటీలను వెంటనే నియమించాలి: సజ్జల

image

AP: ప్రతి నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని YCP రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి నేతలను ఆదేశించారు. వీటి విషయంలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదన్నారు. ఇందుకోసం పార్టీ సెంట్రల్ ఆఫీసులో జనరల్ సెక్రటరీలు, రీజనల్ కో ఆర్డినేటర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. కమిటీ ఏర్పాట్లపై పార్టీ అధినేత జగన్ దృష్టి పెట్టారని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సూచించారు.

News March 16, 2025

రఘునాథపల్లి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంద జకరయ్య (శేఖర్) అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!