News February 3, 2025
పెద్దపల్లి: MLC కవితకు ఘన స్వాగతం..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చిన సందర్భంగా పెద్దపల్లి మండలంలోని పెద్దకాల్వల వద్ద BRS శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నాయకులు కవితకు పుష్పగుచ్ఛం ఇవ్వగా.. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News February 3, 2025
ఈనెల 6 మంత్రి ఫరూక్ సమీక్ష
రాష్ట్రంలో న్యాయశాఖ సంబంధించిన పాలనాపరమైన వివిధ అంశాలపై ఈనెల 6వ తేదీన సమీక్ష చేస్తున్నట్లు సోమవారం మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచి ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణ విషయంపై కూడా న్యాయశాఖ కార్యదర్శితో చర్చించడం జరుగుతుందని మంత్రి ఫరూక్ వెల్లడించారు.
News February 3, 2025
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
AP: మంత్రి నారా లోకేశ్ రేపు సా.4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సా.5.45 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేశ్ విజయవాడ బయల్దేరనున్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
News February 3, 2025
రోడ్డు ప్రమాదంలో అల్లూరి వాసి మృతి
బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం కుక్కునూరు మండలం నెమలిపేటలో సోమవారం సాయంత్రం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వేలేరుపాడు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా లోప ఐతమ్ రాజుల శ్రీనివాస్ మృతి చెందాడు.