News March 22, 2025
పెద్దపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు యువకుడు బలి

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.
Similar News
News March 23, 2025
కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
News March 23, 2025
కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News March 23, 2025
నేడు జిల్లాలో వివిధ పార్టీల ముఖ్య నేతలు

KNR పట్టణంలో నేడు వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తపస్ ఎమ్మెల్సీ అభినందన కార్యక్రమంలో పాల్గొంటారు. తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన అవేర్నెస్ పార్కును మంత్రి పోన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. అనంతరం KNRలో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. BRS KNR ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కరీంనగర్‌కు రానున్నారు.