News January 25, 2025

పెద్దపల్లి: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన కలెక్టరేట్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ వేడుకల్లో నూతనంగా 4పథకాల అమలు కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టడంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ఆన్‌లైన్‌లో నమోదు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రేపు ఉదయం 9గంటలకు కలెక్టర్ కోయ శ్రీహర్షతో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని.. దీనికి జిల్లాలోని ప్రజలు హాజరవ్వాలని అధికారులు కోరారు.

Similar News

News March 14, 2025

MHBD: బైకులో పాము కలకలం (PHOTO)

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివాజీ బైక్‌లో పాము చేరింది. శివాజీ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌లో పాము దూరింది. వెంటనే పైకి లేవగా, అప్రమత్తమైన అధికారి బైక్‌ను పక్కకు నిలిపాడు. సుమారు 2 గంటల తర్వాత పాము కిందకు దిగివెళ్లిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.

News March 14, 2025

FLASH: కామారెడ్డి: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

image

కామరెడ్డి జిల్లాలోని హైవేపై టేక్రియాల్ గేట్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందాడని చెప్పారు. ఆటో వెనుక నుంచి వస్తున్న లారీ నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

News March 14, 2025

హోలీ.. సీఎం రేవంత్ పాత ఫొటోలు

image

TG: హోలీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటి ఆప్తమిత్రులతో కలిసి రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకున్నారు. మరి పై ఫొటోల్లో సీఎం ఎక్కడ ఉన్నారో గుర్తు పట్టారా? కామెంట్ చేయండి.

error: Content is protected !!