News April 5, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కాల్వ శ్రీరాంపూర్ 38.8℃ నమోదు కాగా, రామగిరి 38.8,రామగుండం38.7, సుల్తానాబాద్ 38.7,కమాన్పూర్ 38.7,అంతర్గం 38.6, పెద్దపల్లి 38.5, ఓదెల 38.5, పాలకుర్తి 38.1, ఎలిగేడు 37.9, మంథని 37.9, జూలపల్లి37.7, ముత్తారం 37.5, ధర్మారం 34.5℃ గా నమోదయ్యాయి.
Similar News
News April 6, 2025
సోంపేట మండల యువకుడికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

ఇటీవల విడుదల అయిన SSC CGL ఫలితాల్లో సోంపేట మండలం బారువకొత్తూరులోని మత్స్యకార కుటుంబానికి చెందిన గురుమూర్తి సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 374వ ర్యాంక్ సాధించి కేంద్రం ప్రభుత్వంలో ఉద్యోగం సాధించారు. కస్టమ్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు శకుంతల, మోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. అతనికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News April 6, 2025
నెల్లూరు: బస్ స్టాండ్‌లలో రద్దీ

నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్‌లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్‌లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News April 6, 2025
కన్నులపండువగా కోదండ రాముని ధ్వజారోహణం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం శ్రీరామ నవమి రోజు ధ్వజారోహణం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేడుక నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.