News March 16, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంథని 40.8℃ నమోదు కాగా రామగిరి 40.6, పాలకుర్తి 40.5, అంతర్గం 40.4, కమాన్పూర్ 40.3, సుల్తానాబాద్ 40.2, ఓదెల 40.1, ముత్తారం 39.7, కాల్వ శ్రీరాం 39.5, రామగుండం 39.4, పెద్దపల్లి 39.3, ధర్మారం 38.4, ఎలిగేడు 37.7, జూలపల్లి 36.3℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.
Similar News
News March 17, 2025
భువనగిరి కోటపైన రోప్ వే

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.
News March 17, 2025
జిల్లాలో 128 కేంద్రాలు.. 26,497 విద్యార్థులు

పల్నాడు జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు మొత్తం 128 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈవో చంద్రకళ తెలిపారు. ఆ పరీక్షా కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 12,869 మంది రెగ్యులర్ బాలురు, 12,778 మంది రెగ్యులర్ బాలికలు ఉన్నారు.586 మంది ప్రైవేట్ బాలురు,304 మంది బాలికలు ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్నారు. 6గురు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 6 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు.
News March 17, 2025
అరిలోవ: జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన దంపతులు అరెస్ట్

సెంట్రల్ జైలులో ఖైదీలకు ఫోన్‌లు అందించిన కేసులో భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దంపతులు శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.